Thursday, 16 April 2026 06:54:00 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మిట్స్ విద్యార్థి థీసిస్ అంతర్జాతీయం గా ప్రచురణ

హర్షం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ , ప్రొఫెసర్లు

Date : 01 May 2025 08:19 PM Views : 660

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 01 : అంగళ్ళు సమీపం లోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, మదనపల్లి కళాశాల నందు బి.టెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న ఎస్.మొహమ్మద్ బాషా ఎలక్ట్రిక్ వాహనాలు యొక్క బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనే అంశం పై పరిశోధన కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎలక్ట్రికల్ ఇండియా మ్యాగజిన్ లో ప్రచురించబడిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలియజేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో, వివిధ మ్యానుఫ్యాక్చయిరింగ్ సెల్స్‌తో కూడిన బ్యాటరీ ప్యాక్లను సమర్థవంతంగా నిర్వహించడం, పాతవైన లేదా వాడిన బ్యాట్రీలో తేడా ఉన్న సెల్స్‌ను ఒకే బ్యాటరీ ప్యాక్‌లో కలిపితే, మొత్తం పనితీరు తగ్గిపోయే అవకాశమ తో పాటు, విద్యుత్ వినియోగ సామర్థ్యం తగ్గి, భద్రతాపరమైన ప్రమాదాలు ఏర్పడవచ్చు. ఇలాంటి మిశ్రమ వయస్సు సెల్స్ చార్జింగ్ సామర్థ్యం మరియు పాడయిన స్థాయిలలో తేడాలు చూపుతూ, వోల్టేజ్ మరియు వేడి పంపిణీలో అసమతుల్యతను కలిగిస్తాయి. దీని వల్ల బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) పనితీరును సమర్ధవంతంగా నియంత్రించడం కష్టమవుతుంది. కాల్మాన్ ఫిల్టర్లు మరియు మెషీన్ లెర్నింగ్ మోడల్స్ వంటి ఆధునిక ఆల్గోరిథంలను రియల్‌టైమ్‌లో గల అసమతుల్యతను గుర్తించి సరిచేయడానికి ఉపయోగిస్తున్నారు. విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ డిజిటల్ ట్విన్లు, మాడ్యులర్ కంట్రోల్, మరియు అడాప్టివ్ బ్యాలెన్సింగ్ సర్క్యూట్లు వంటి టెక్నాలజీలు బ్యాటరీల జీవితకాలాన్ని పెంచే దిశగా ముఖ్యపాత్ర పోషితున్నాయని, విభిన్న వయస్సుల సెల్స్‌లో ఒకే రకమైన పనితీరును నిర్ధారించడం ద్వారా బ్యాటరీ జీవితం గణనీయంగా పెరిగి , నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు. ఈ వి వినియోగం పెరుగుతున్న తరుణంలో, తెలివైన బ్యాటరీ నిర్వహణ, బ్యాటరీను మించిన ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది అని అన్నారు. పరిశోధనకు సహకరించిన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ మరియు మొహమ్మద్ భాషను కళాశాల కరెస్పాండంట్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ అభినందనలు తెలియజేసారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :