నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 24 : తంబళ్లపల్లె మండలం లోని సచివాలయ సిబ్బంది పి4 పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి బంగారు కుటుంబాల ఎంపిక విజయవంతం చేయాలని ఎంపీడీవో థామస్ రాజా పిలుపునిచ్చారు. బుధవారం సచివాలయ ఉద్యోగులతో పి 4 పై జరిపిన సమీక్షలో బంగారు కుటుంబాల ఎంపికతో నిరుపేద కుటుంబాలు అభివృద్ధి బాట బట్టి ఆర్థిక సమానత్వం పెంపొందుతుందని సూచించారు. సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయి లో పర్యటించి బంగారు కుటుంబాల ఎంపిక పారదర్శకంగా నిర్వహించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించాలని సూచనలు చేశారు. ఈ సమీక్షలో ఈఓఆర్డి ఈశ్వర్ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News