నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - అక్టోబర్ 26 : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా సెక్రెటరీగా కోసువారిపల్లి సర్పంచ్ విజయలక్ష్మి కుమారుడు హరీష్ ఎంపికయ్యాడు. వైకాపా నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి వారధిగా చేసిన కృషికి ఈ పదవి లభించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఇందుకు సహకరించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలకు హరీష్ కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News