నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి1 : దశాబ్దాలుగా అన్ని రంగాలలో అణగతొక్క పడిన మాదిగ జాతి లో చైతన్యం తెచ్చి తమ హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమంలో భాగంగా అమరులైన మాదిగ సోదరులకు శనివారం తంబళ్లపల్లెలో ఎమ్మార్పీఎస్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ అమరవీరుల చిత్రపటాలకు పూజలు నిర్వహించి వారు భౌతికంగా లేకపోయినా వారి ఉద్యమం చేసిన కృషి ఫలితమే నేడు సంక్రమిస్తున్న ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు వారికే అంకితమని ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటప్పలు కొనియాడారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ అమరవీరులకు జోహార్లు, అమరవీరులు అమర్ రహే, మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ నాయకులు గోపిదిన్నె మల్లికార్జున, బొజ్జప్ప, మారప్ప, టిడిపి నాయకుడు వీరాంజనేయులు, రెడ్డప్ప, చిన్నా, ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News