Thursday, 16 April 2026 08:26:17 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

గుండ్లపల్లి లో అట్ట హాసంగా అన్నదాత సుఖీభవ - పియం కిసాన్

హంద్రీనీవా జలాలతో సస్యశ్యామలం - దాసిరిపల్లి జయచంద్రా రెడ్డి

Date : 02 August 2025 08:19 PM Views : 410

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 02 : తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ప్రతి చెరువు కు హంద్రీనీవా జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడం ఖాయమని తంబళ్లపల్లె ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం గుండ్లపల్లి ఆర్బికే ఆవరణంలో అన్నదాత సుఖీభవ సీఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జేసీఆర్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం రైతులను అన్నిరకాలుగా మోసం చేసిందని మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొని నేడు అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతు ఖాతాలో ఐదు వేలు, పి. యం. కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు జమ చేసినట్లు చెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో 44 867 మంది రైతులకు రూ31.40 కోట్లు తంబళ్లపల్లె మండలానికి 82 73 మంది రైతులకు రూ 5.79 కోట్లు జమ అయినట్లు చెప్పారు. తంబళ్లపల్లె అబ్జర్వర్ దినేష్ రెడ్డి మాట్లాడుతూ ఇది రైతుల ప్రభుత్వమని నేడు సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం తో పాటు రైతుల ప్రకృతి వ్యవసాయం కోసం డ్రోన్ ప్రయోగంతో రైతులకు సహకరిస్తున్నట్లు చెప్పారు. తంబళ్లపల్లె పరిశీలకులు సోమశేఖర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ తోబాటు ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ సౌకర్యం తో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన ఘనత కూటం ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ మాట్లాడుతూ గత వైకాపా రైతులకు కేవలం 13వేలు ఇస్తే కూటమి పాలనలో రైతులకు 20వేలు ఇచ్చి రైతు ప్రభుత్వంగా నిలిచినట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందజేసిన అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ నిధులు పంట సాగులకు ఉపయోగించుకోవాలని ఎక్కడైనా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాని రైతులు వ్యవసాయాధికారులు, మన మిత్రలను సంప్రదించాలన్నారు వచ్చే మాసంలో కౌలు రైతులకు సైతం రూ 10 వేల చొప్పున పంపిణీ జరుగుతుందన్నారు. అనంతరం నాయకులు రూ 31.40 కోట్ల చెక్కును రైతులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏవో రమణ కుమార్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో థామస్ రాజా, ఏపీఎం గంగాధర్, ఏ ఈ ఓ సురేష్, మండల అబ్జర్వర్ రెడ్డప్ప,పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర,, పార్లమెంట్ బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి సోమశేఖర్, క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు తులసీదర్ నాయుడు ,గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డప్ప నాయుడు, మాజీ సర్పంచ్ లక్ష్మి నారాయణ నాయుడు, రాజపేట తెలుగు యువత కార్యదర్శి మధు, పెద్ద వీరభద్ర, రామచంద్ర, జనసేన నాయకులు ఎద్దుల నరసింహులు, సిద్ధమల్ రెడ్డి మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :