Thursday, 16 April 2026 06:52:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

చెంబకూరు లో విసుబుల్ పోలీస్

ప్రజలతో మమేకమై పలు అంశాలు పై చర్చించిన యస్.ఐ. రమేష్ బాబు

Date : 06 October 2025 07:44 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 06 : రామసముద్రం మండలం చెంబకూరు మేజర్ పంచాయతీలో సోమవారం యస్.ఐ రమేష్ బాబు సందర్శించి పలు అంశాలుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ మండలం ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకోసం జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాధ్ ఆదేశాలమేరకు చెంబకూరులో పోలీస్ లు విజిబుల్ పోలీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ నేరాలు నియంత్రించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాలబారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఫోన్ లో ఎవ్వరైనా మెసేజ్ లో పెట్టె లింకులను క్లిక్ చేయవద్దన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికి పంచుకోవద్దని సూచించారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారు డ్రైవర్ లు సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే కూడా చర్యలు తప్పవన్నారు. పోలీసులు ప్రజలు మధ్య ఉంటూ వారికి రక్షణ కల్పిస్తామన్నారు. ప్రజల భద్రతకు సంబందించిన ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే మండలంకేంద్రంలో పోలీస్ సిబ్బందిలో వాహనాలు తనికీ చేశారు. సరైన పత్రాలు లేని 20 వాహనాలకు జరిమాన విధించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :