నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి: నమిత న్యూస్:- మార్చి 9 :-చక్రాయపేట మండలం స్థానిక ఆంజనేయ పురం నందు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నాగమణి మాట్లాడుతూ ప్రతి మహిళా ఆర్థిక సాధికారతను సాధించవలసి ఉన్నదని జీవనోపాదులు పెంపొందించుకోవాలని ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని తద్వారా కుటుంబం ఆదాయం పెంచుకొని మహిళలు మహారాణులుగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ డిఆర్డిఏ ఆంజనేయులు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ప్రతి మహిళ కష్టపడి పని చేయాలని కుటుంబములో ప్రతి ఒక్కరు ఎదో ఒక జీవనోపాధి చేపట్టి తలసరి ఆదాయాన్ని పెంచుకోవచ్చని ప్రతి మహిళా ఒక పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.మహిళలు సామాజిక చైతన్యం కలిగి సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న సామజిక రాజకీయ, ఆర్థిక వివక్షతను సామూహికంగా ఎదుర్కోవాల్సి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మూఢనమ్మకాలు బాల్యవివాహాలు బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడం లో మహిళ తన హక్కులను రక్షించుకునే విధంగా స్వయం సహాయక సంఘాలు గ్రామ సంఘాలు కృషి చేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డిగారు వైయస్సార్ ఆసరా వైయస్సార్ చేయూత జగనన్న పాల వెల్లువ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీఠ వేశారని తెలిపారు. వ్యవసాయం లో మహిళల భాగస్వామ్యం తో పాడి పరిశ్రమ మరియు ప్రకృతి వ్యవసాయం అనుసంధానం చేయడం ద్వారా వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవచ్చు,పాడి పరిశ్రమ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని మహిళలకు సూచించారు.తదనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలు పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మండల సమాఖ్య తరపున ఉత్తమ సేవలు అందించిన ఆధ్వర్యంలో మహిళలకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించి విజేతలకు ఏపీఎం ఆంజనేయులు చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ లు రాజన్న, నాగేశ్వర్ రావ్ సుహాసిన గ్రామ సమైక్య అధ్యక్షురాలులు గ్రామ సమాఖ్య అసిస్టెంట్లు, సెక్రటరీలు మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్ కవిత, సరస్వతి డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News