నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైసిపి తన ఉనికి చాటుకునేందుకే రైతు పోరుబాట. హెరిటేజ్ లో పాల పదార్థాలు మాత్రమే అమ్ముతారు ఉల్లిపాయలు కాదు.? ఇది కూడా తెలియని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్ జె వెంకటేష్ వైసిపి తన ఉనికిని చాటుకునేందుకే రైతు పోరుబాట కార్యక్రమం చేపట్టిందని టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్ జె వెంకటేష్ విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని తన కార్యాలయం లో ఆయన మాట్లాడారు. వైసీపీ తన ఉనికిని చాటుకునేందుకే రైతు పోరు కార్యక్రమం చేపట్టిందని ఇలాంటి కార్యక్రమాలను ప్రజలు నమ్మరని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హెరిటేజ్ లో ఉల్లిపాయలు అమ్ముతున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హెరిటేజ్ లో కేవలం పాలు, పాల పదార్థాలు మాత్రమే అమ్ముతారని కూడా తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే యూరియా కొరత ఎక్కడా లేదని రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో రైతులకు యూరియాను అందిస్తున్నారని తెలిపారు. ఇకపోతే రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇటీవల మామిడి రైతు నష్టపోతే నాలుగు రూపాయల మద్దతు ధర కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. అలాగే పొగాకు మిర్చి రైతులకు కూడా ప్రభుత్వం ఆదుకునందిని గుర్తు చేశారు. ఉల్లిపాయలను క్వింటాలు 1200 రూపాయలతో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో తంబళ్లపల్లె పర్యటనలలో పర్యటించడం జరిగిందన్నారు. టమోటా రైతులను ఆదుకుంటానని .. ధరల స్థిరీకరణ చేపడతానని చెప్పి తర్వాత రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైకాపా ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై టమేటాలు పరబోసిన రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పారు . ఇలా రైతుల కష్ట నష్టాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పక్షపాతిగా కూటమి నిలబడుతోందన్నారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నిస్సార్ అహ్మద్ కూడా నిజా నిజాలు తెలుసుకోకుండా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం పరిపాటి అయిందన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, చాంద్ భాషా ఎక్స్ ఎంపీటీసీ బాలినేని చంద్రశేఖర్ నాయుడు, కృష్ణప్ప, మణి ప్రకాష్, సి. బాలాజీ.
Reporter
Namitha News