నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హనుమయ్య జిల్లా మదనపల్లి 25/10/2024 దశాబ్దాలుగా వాల్మీకులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాల్మీకి సంఘం ఆంద్రప్రదేశ్ అధ్యక్షులు పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ, నామినేట్ పదవులు, స్దానిక సంస్థలలో సముచిత స్థానం లక్ష్యంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యంలో కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు నుండి చేపట్టిన పాదయాత్రకు కర్నాటక రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలు మద్దతు ప్రకటించారు. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యంలో రాయలపాడు క్రాస్ నుండి మదనపల్లె, పుంగనూరు మీదుగా బోయకొండ గంగమ్మ ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కర్ణాటక వాల్మీకి నవ సమాజ సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ వెంకట్, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ పాదయాత్రలో భాగంగా శుక్రవారం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, శనివారం పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్లా బాబురెడ్డి, ఆదివారం బోయకొండ గంగమ్మ తల్లికి వినతిపత్రం అందజేస్తామని వివరించారు. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన లక్ష్యం వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అన్నారు. దేశ వ్యాప్తంగా వాల్మీకుల మద్దతు కోరుతూ కర్ణాటక రాష్ట్రంలోని రాయలపాడు నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగిందని, కర్ణాటక రాష్ట్రంలోని వాల్మీకులు తమకు మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ తోపాటు అంతేకాకుండా బోయకొండ గంగమ్మ చైర్మన్, మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్, మదనపల్లె, పుంగనూరు మున్సిపల్ చైర్మన్లు, జడ్పిటిసి, ఎంపీపీ పదవులలో బోయలకు అధిక పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో కర్ణాటక వాల్మీకి నవ సమాజ సంఘంస్టేట్ యూత్ ప్రెసిడెంట్ వెంకట్, స్టేట్ కన్వీనర్ నాగరాజు, శ్రీనివాసపురం తాలూకా ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంజుల, ప్రదీప్, శ్రీనివాసులు, వాల్మీకి యువకర సంఘం జనరల్ సెక్రెటరీ కోటే శ్రీనివాస్, వాల్మీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దల జయసింహ, వలసల మంజునాథ్, ముక్కండ్ల జగదీష్, పారేసు కృష్ణమూర్తి, అరవ నిర్మలమ్మ,బొంత సోము, బొంత రామకృష్ణ, పారపట్ల నరసింహులు, పత్తేపురం నారాయణ, పుర్ర చలపతి వాల్మీకి కుల బాంధవులు పాల్గొన్నారు.
Reporter
Namitha News