నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : శ్రీఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా జరగడం ఎంతో సంతోషంగా వుందని వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాశి హరిక్రిష్ణ పేర్కొన్నారు. మదనపల్లె పట్టణం రాగిమాను సర్కిల్ వద్ద వాల్మీకి మహాసేన ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా జరుపుకోవడం వాల్మీకుల ఐక్యతకు నిదర్శనం అన్నారు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వాల్మీకి మహర్షిపై చరగని అభిమానం చాటుకున్నా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి సెలవు దినంగా ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే వాల్మీకి జయంతికి నేషనల్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా వాల్మీకులకు ఎస్టీ జాబితాలో స్దానం కల్పించాలని కోరారు. వాల్మీకి సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రంలో ఎస్టీ పునరుద్ధరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి మహాసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాశి హరికృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు నల్లబోతుల సుదర్శన్ బాబు, జిల్లా అధ్యక్షులు బొగ్గిటి కృష్ణమూర్తి, జిల్లా నాయకులు సాకే కృష్ణమూర్తి, రామకృష్ణ, సుస్మిత్, సాకే మల్లప్ప, కుండబల్లి ముని వెంకటప్ప, రాగిమాకులపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News