Thursday, 16 April 2026 07:00:22 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ ను దొంగబాబా కు ధారాదత్తం చేయటానికి యత్నిస్తే పోరాటమే - సిపిఐ నారాయణ

Date : 08 July 2025 08:23 PM Views : 331

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట - జులై 08 : ఆహ్లాదకరమైన హర్సి హిల్స్ ను దొంగ సన్యాసికి ఇచ్చి నాశనం చేస్తారా , ప్రకృతి అందాలను ప్రజలకు దూరం చేస్తారా , నకిలీ మందులు అమ్మే రాందేవ్ బాబాకు అసలు ఇవ్వద్దు అంటూ అన్నమయ్య జిల్లా ఎస్పీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు ఇచ్చారా , హార్సీహిల్స్ ను దొంగల పాలు కాకుండా పోరాటాలు ఉదృతం చేస్తాం . హర్సీ హిల్స్ ను సందర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆహ్లాదకర మైన హార్సీ హిల్స్ ను దొంగ సన్యాసికి ఇచ్చి ప్రకృతి అందాలను ప్రజలకు దూరం చేయద్దు అని మంగళవారం సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హార్సిీ హిల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కే నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర ఊటీగా పేరు ఉన్న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం లోని హార్సీ హిల్స్ ను నకిలీ మందులు అమ్ముకునే రాందేవ్ బాబాకు అప్పగించాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. 165 సంవత్సరాల క్రితం హార్సి హిల్స్ అనేది ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి హార్శి కనుగొన్నారని ఈ హార్శీ హిల్స్ తిరుమల కొండ కంటే చాలా ఎత్తైన సౌందర్యమైన ప్రదేశమని ఇది టూరిస్ట్ ప్లేస్ గా మార్చడానికి ఆర్ సి అనే కలెక్టర్ మంచి పని చేశారు అని బాగా డెవలప్ చేస్తే ఊటి కంటే బాగుంటుందని మంచి ఎండాకాలంలో కూడా బాగా చలిగా ఉన్న ప్రదేశం అలాంటి అందమైన ప్రదేశాన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు“ కమ్యూనిజం లేదు సోషలిజం లేదు టూరిజం ఒకటే అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేను టూరిజం పైన కూడా నమ్మకం కోల్పోయావా దీనిని ఎందుకు డెవలప్ చేయడం లేదు చంద్రబాబు అని ప్రశ్నించారు. రాందేవ్ బాబా సన్యాసి కాదని సన్యాసి ముసుగులో కార్పొరేట్ వ్యాపారవేత్తని ఆయన అన్నారు అలాంటి వ్యక్తికి ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి అందాలను అప్పజెప్పడం అంటే వినాశకరానికి నాంది పలకడమేనని అలాంటి చర్యలను వెంటనే మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితువు పలికారు. రాందేవ్ బాబా కార్పొరేట్ సంస్థలకు సమానంగా ఎదిగాడని అతను నకిలీ దొంగ కపట బాబా అని అన్నారు. ఈ హర్సీ హిల్స్ చూడడానికి రాందేవ్ బాబా వస్తే మదనపల్లె మొత్తం ట్రాఫిక్ మూసేశారని ఇక్కడ కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు హోటల్లో అన్ని మూసి వేయడం ఇక్కడ ఉన్న వారందరినీ తరిమేశారని ఇంకా ఇక్కడే అతనికి ఇస్తే సామాన్య ప్రజలకు స్థానం ఉండదని హర్సీ హిల్స్ అనేది కాస్ట్లీ హిల్స్ గా మారుతుందని రాందేవ్ బాబా కు ఐఏఎస్ ఐపీఎస్ లు అతని వెంట వచ్చి ఊడిగం చేయడం ఏమిటని రాందేవ్ బాబా ఏమన్నా దేశ ప్రధాని లేక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వచ్చిన అధికారులు అంత శ్రద్ధ తీసుకునే వారు కాదు కానీ ఒక దొంగ బాబా వస్తే అంత మర్యాదలు ఎందుకు చేశారు అని ఆయన ప్రశ్నించారు. రాందేవ్ బాబాకు హర్సీ హిల్స్ ఇస్తే అది అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారుతుందని ఇప్పటికే దేశంలో అనేక నకిలీ దొంగ బాబాలను చూస్తున్నామని కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కి అందాచందాలు కలిగినటువంటి సహజ సిద్ధ ప్రకృతిని ధ్వంసం చేయకుండా టూరిజం అభివృద్ధి చేయమని మీకు అంతగా ఇవ్వాలనుకుంటే జిడ్డు కృష్ణమూర్తి లాంటి సంస్థలకు ఇచ్చి మరింత అభివృద్ధి చేయమని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. రాందేవ్ బాబాకు ఇవ్వాలని మీరు అనుకుంటే మరింత ఉద్యమాలు ఉదృతం చేస్తామని సహజ సంపదను కాపాడుకోవడానికి మా పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. అలాగే రాందేవ్ బాబా వచ్చిన మరుసటి రోజు బుద్ధుని విగ్రహ తల నరకడం చాలా దురదృష్టకరమని దాని నిరసిస్తూ ప్రజా సంఘాలు నిరసన తెలిపితే ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ నిరసన తెలుపకూడదని నాన్ బెయిల్ బుల్ కేసులో నమోదు చేయడం దురదృష్టకరమని అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఐపీఎస్ సూత్రాలు కాకుండా ఎస్పి సూత్రాలు ఏమన్నా ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఏదన్నా ఈ జిల్లాలో నిరసన తెలపాలంటే ఆధార్ కార్డులు సమర్పించాలనడం ఇది ప్రపంచంలో ఎక్కడా లేని చట్టాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ తీసుకొచ్చారా? ఈ ఎస్పీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లేడా హోం మంత్రి శాఖ ఆధ్వర్యంలో లేడా అని. ఆయనకు ఏమన్నా ప్రత్యేక అధికారాలు ఇచ్చారా అని నారాయణ ప్రశ్నించారు. ఈ ఎస్పీ పైన రాష్ట్రప్రభుత్వం హోం మంత్రి ఆలోచన చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకుండా ప్రజా హక్కులను రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు సహాయ కార్యదర్శి పి మహేష్ కార్యవర్గ సభ్యులు తోపు క్రిష్టప్ప, సాంబ, మురళి, మనోహర్ రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు బషీర్ ఖాన్, సిపిఐ ములకలచెరువు మండల కార్యదర్శి అంజనప్ప, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ సహాయ కార్యదర్శి వినయ్ నాయకులు సాయి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రెడ్డి సాహెబ్,AITUC బి కొత్తకోట మండల అధ్యక్ష, కార్యదర్శులు యస్.తంబయ్య శెట్టి జి.రఘునాథ్ లు బహుజన్ సేన నాయకులు శ్రీ చందు,మహేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :