నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 25 : తంబళ్లపల్లె మండలం నుండి ట్రిపుల్ ఐటి కి ఏడు మంది ఆణిముత్యాలు ఎంపికైనట్లు ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ లు విలేకరులకు తెలిపారు. తంబళ్లపల్లె మోడల్ స్కూల్ నుండి ఎస్. వాహీద్ (ఇడుపులపాయ)జి.నవీన్ కుమార్ రెడ్డి(నూజివీడు), ఎస్ పల్లవి(ఒంగోలు ), తమ్ముళ్ల పల్లె జడ్పీ హైస్కూల్ నుండి బి లావణ్య(ఒంగోలు ) పి హిమబిందు(ఇడుపులపాయ), గోపి దిన్నె హై స్కూల్ నుండి జోష్ణవి(ఇడుపులపాయ )బిసి గురుకులం నుండి యశ్వంత్(ఒంగోలు) ట్రిబుల్ ఐటీకి ఎంపిక కావడం పై మోడల్ స్కూల్ కమిటీ చైర్మన్ జయప్రద, తంబళ్లపల్లె హై స్కూల్ చైర్మన్ శివకుమార్, గోపి దిన్నె హై స్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు హర్షం వ్యక్తం చేసి ఇందుకు సహకరించిన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, తంబళ్లపల్లె, గోపి దిన్ని హై స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News