నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 28 : రామసముద్రం మండలం ఆర్.నడింపల్లి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీ బుధవారం నుండి 2వ తేదీ గురువారం వరకు దసరా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పత్రికా సమావేశంలో గ్రామస్తులు తెలిపారు.ఈ క్రీడా పోటీలలో మొదటి బహుమతి జడ్పీటీసీ సి హెచ్ రామచంద్రా రెడ్డి స్పాన్సర్డ్ 25116 రూపాయలు, రెండవ బహుమతి నడింపల్లె యూత్ 15116 రూపాయలు, మూడవ బహుమతి మహేష్ 10116 రూపాయలు, వేణు,వాలీ లు నాలుగో బహుమతి 5116 రూపాయలు స్పాన్సర్ చేస్తారని తెలిపారు. కావున ఆసక్తి వున్న క్రికెట్ అభిమానులు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు. భోజన వసతులు కిట్టప్ప, సి. మధు, సి. శివకుమార్ ట్రోపి డాక్టర్ సోమశేఖర్ అందజేయడం జరుగుతుందన్నారు. నిబంధనలు ఉంటాయని, ముఖ్యంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ గ్రామ ప్రజలకు మాత్రమే అని తెలిపారు.
Admin
Namitha News