Thursday, 16 April 2026 06:40:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

సంఘమిత్ర భారతి పేరును ఆన్ లైన్ లో తొలగించిన ఏపిఎం మురళి పై చర్యలు తీసుకోవాలి

Date : 18 March 2025 09:51 AM Views : 518

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సంఘ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసి ఆందోళన బి.కొత్తకోట - తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం బడికాయలపల్లి -4వీవో సంఘమిత్ర భారతి పేరును ఆన్ లైన్ లో తొలగించిన గత ఏపిఎం మురళి పై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ , జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ సలీం భాషా డిమాండ్ చేశారు సోమవారం సంఘ సభ్యులతో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ 2011 లో గ్రామ సమాఖ్య తీర్మానం ప్రకారం సంఘమిత్ర భారతి నీ సభ్యులు ఎన్నుకున్నారని తెలిపారు.అప్పటి నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామ సమాఖ్య నడుపుతున్నారన్నారు 2024 నవంబర్ నుంచి ఆన్ లైన్ లో సంఘమిత్ర భారతి పేరును అప్పటి ఏపీఎం మురళి తొలగించారని ఆరోపించారు.సభ్యలు తీర్మానం చేయకుండా, సభ్యులకు సమాచారం లేకుండా అకారణంగా సంఘమిత్ర భారతి పేరును ఆన్ లైన్ లో తొలగించి అన్యాయం చేశారని, ప్రస్తుతం ఏపీఎం బ్యాంకు అధికారులకు భారతి నీ సంఘమిత్ర తొలగించామని చెప్పడం సమంజసం కాదన్నారు.జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సంఘమిత్ర భారతి పేరును ఆన్ లైన్ లో నమోదు చేసి సంఘమిత్రగా కొనసాగించాలని,గత ఏపీఎం మురళి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాపితంగా ఆందోళనలు చేపడుతామన్నారు ఈ కార్యక్రమంలో సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ళ శ్రీనివాసులు ఏఐటీయూసీ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి బత్తల వెంకటరమణ , జిల్లా ఉపాధ్యక్షుడు వేణు గోపాల్ రెడ్డి, సంఘమిత్ర భారతి, సభ్యులు రమణమ్మ, వెంకటలక్ష్మి, శంకరమ్మ, సులోచన, సుమిత్ర, లక్ష్మి దేవి, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :