నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమిత న్యూస్ : అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలోని పుట్టపర్తి సాయిబాబా మందిరంలో స్వామివారి వర్ధంతిని పురస్కరించుకుని ఆ రాధనాత్సవాలను ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి సాయిబాబా 14వ వర్ధంతి సందర్భంగా బుధవారం బి కొత్తకోటలోని పుట్టపర్తి సాయిబాబా మందిరంలో ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సాయిబాబా సేవా సమితి గౌరవ అధ్యక్షుడుడాక్టర్ వాకా వెంకటరమణారెడ్డి, అధ్యక్షుడు షాజహాన్ ఖాన్, ల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం, వస్త్ర దానం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు డి ఆదినారాయణ, ఎం సుబ్బారెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
Admin
Namitha News