నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి - ఏప్రిల్ 28: అన్నమయ్య జిల్లా లోని తంబళ్లపల్లె మల్లయ్య కొండ వద్ద చెట్టు కు ఉరివేసుకుని మృతి . సోమవారం సాయంత్రం వెలుగు చూడటంతో కలకలం రేపుతోంది. చేతులపైన కోసుకున్నట్లు గీతలు కనిపించడం, కాళ్లకు వేసుకున్న చెప్పులు అలాగే ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మృతి పై అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు . మృతుడు బి.కొత్తకోట మండల వాసిగా భావిస్తున్నారు . సమాచారం అందగానే ఎస్ఐ లోకేష్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి పంచనమా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి దర్యాప్తు చేపట్టారు
Reporter
Namitha News