Thursday, 16 April 2026 04:49:04 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

శ్రీరామ కోటి లిఖించిన పుస్తకాలు విశ్వహిందూ పరిషత్ కు అప్పగింత

Date : 28 June 2025 06:32 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - జూన్ 28 : విశ్వ హిందూ పరిషత్ గుర్రంకొండ వారి సహకారంతో ధర్మో రక్షతి రక్షితః పేరిట జరుగుతున్న శ్రీరామ కోటి నామ లిఖిత కార్యక్రమంలో ఇప్పటివరకు 200 పుస్తకాలు అనగా సుమారు 10,36,800(పది లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందలు)శ్రీరామనామాలు పూర్తి చేపించడం జరిగింది.ఇప్పటివరకు పూర్తి చేయించిన శ్రీరామ కోటి నామ లిఖిత పుస్తకాలను "ధర్మో రక్షతి రక్షితః" కార్యక్రమం నిర్వహణ సభ్యులు గుర్రంకొండ విశ్వ హిందూ పరిషత్ మండల ప్రఖండ తిరువీధి శ్రీధర్ మరియు గండి శ్రీ వీరాంజనేయ స్వామి మాలధారణ గురువులు ఉప్పు శ్రీనివాసులు గారికి చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగానూ మరియు పరోక్షంగానూ సహకరించిన ప్రతియొక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఎల్. ప్రసాద్, మావిళ్ళ శ్రీనివాసులు, ఎల్. అనిల్ కుమార్, పూజారి పద్మనాభం, ఎల్. వరుణ్ తేజ్, చింతిర్ల వెంకటేష్, బళ్లారి శ్రీనివాసులు, ఎస్.పి నవీన్ కుమార్ పి. హర్షిత్ కుమార్, ఎల్. లోహిత్ కుమార్ పాల్గొన్నారు. భక్తాదులు వ్రాసే ప్రతి 'శ్రీరామ కోటి' నామ లిఖిత పుస్తకాన్ని అయోధ్యలోని శ్రీరాముని పాదాల చెంత చేర్చబడునని తిరువీధి శ్రీధర్ ఈ సందర్బంగా తెలిపారు. గుర్రంకొండ కొత్తపేట వీధిలో ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ ఆలయము నందు ప్రతి ఆదివారం ఉదయం 08.00 గంటల నుండి 09.00 గంటల వరకు "ధర్మో రక్షతి రక్షితః" పేరిట శ్రీరామ కోటి నామ లిఖిత కార్యక్రమం ఉచితంగా నిర్విరామంగా జరుగుతుంది.కావున ఈ కార్యక్రమంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా, వయసుకు సంబంధం లేకుండా ప్రతియొక్కరూ పాల్గొనాలని కోరుతున్నాము.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :