నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 25 : రామసముద్రం మండలం లోని పెద్దకురప్పల్లె గ్రామం తిరుమలరెడ్డిపల్లె లో కొలువైన ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో దసరా సందర్బంగా ఆలయ అర్చకులు వి. కె రాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం ఆలయ శుద్ధి చేసి స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు,తమలపాకుల తోరణం, పలు రకాలు పుష్పాలు తో శ్రీ వీరాంజనేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అనంతరం మహా మంగళహారతి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.స్వామివారిని శకుంతలమ్మ, విశ్రాంతి ఉద్యోగి రవీంద్రనాథ్ రెడ్డి, వెంకరత్నమ్మ దంపతులు స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు వి కే రాజు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామిదర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డి, సునీత దంపతులు అన్న ప్రసాదాలు వితరణ చేశారు.
Admin
Namitha News