నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 30 : తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని మల్లయ్య కొండల్లో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ముని రాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్టాలు విలేకరులకు తెలిపారు. మల్లయ్య కొండకు పండుగ సందర్భంగా ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు తోబాటు కొండపై భక్తులకు తాగునీరు సౌకర్యం తో పాటు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా శివాలయంలో మహా శివుని కి ప్రత్యేక పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించడం తోపాటు గౌరీ మాత ఆలయం, వీరన్న గెవి, ఎలకతీర్థం, భగీరథి, వెలుగు మల్లమ్మ ఆలయాల్లో సైతం భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు సైతం సమన్వయం పాటించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Reporter
Namitha News