Thursday, 16 April 2026 06:39:26 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మల్లన్న హుండీ లెక్కింపు

మల్లయ్య కొండ హుండీ ఆదాయం రూ5,23,275

Date : 15 July 2025 10:08 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 15 : తంబళ్లపల్లె మండల కేంద్రానికి సమీపం లోని మల్లయ్య కొండలో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ మూడు మాసాల హుండీ లెక్కింపు ద్వారా రూ 5,23,275 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో ముని రాజా, రికార్డు అసిస్టెంట్ కొండకిట్ట లు తెలిపారు. మంగళవారం ఉదయం మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, ఉత్తమ రెడ్డి, టిడిపి నాయకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు , అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి అనంతరం టిడిపి నాయకులు, భక్తులు సుచిశుభ్రతతో ఆలయ ప్రధాన హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లయ్య కొండ మల్లికార్జున స్వామి ఆదాయం పెరగడం హర్షనీయమని భవిష్యత్తులో భక్తుల సౌకర్యార్థం తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ దాసరిపల్లి జయ చంద్రారెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధమ్మ, టిడిపి మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, రామచంద్రారెడ్డి, కాలా నారాయణ, బాలకృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, నరసింహులు, ఆలయ అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :