నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హార్సిలీహిల్స్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తే సహించం పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయాలి - కాంగ్రెస్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్,వామపక్ష ప్రజాసంఘాలు అభ్యంతరం మదనపల్లె : ఆంధ్ర ఊటీగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రం హార్శిలీహిల్స్ లో కార్పొరేట్ సంస్థకు భూములు అప్పగించడాన్ని మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్,సిపిఐ,ఏఐటియుసి,ఆమ్ ఆద్మీ,సిపిమం,బాస్ సంస్థ నాయకులు వ్యతిరేకించారు.ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకొని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అ పార్టీ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు,సీపీఐ పార్టీ నాయకులు కృష్ణప్ప,మురళి,ఏఐటియుసి నాయకులు సాంబశివ,ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సయ్యద్ రహీం,బాస్ వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్,సిపిఎం పార్టీ నుండి ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వరమ్మ,మహమ్మద్ అలీ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ యోగా గురువు రాందేవ్ బాబాకు భూములు కట్టబెడితే వామపక్ష పార్టీలు,ప్రజాసంఘాలతో కలసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.వ్యాపారవేత్త రాందేవ్ బాబా మదనపల్లె చేరుకున్న సందర్భంలో సబ్ కలెక్టర్,డియస్పీ,నియోజకవర్గ అధికారులు స్వాగతం పలకడంపై ఆక్షేపించారు.హార్సిలీహిల్స్‌లో వైసిపి ప్రభుత్వం యాత్ర సినిమా డైరెక్టరుకు భూ కేటాయింపులు చేస్తే వ్యతిరేకించిన అనాటి కూటమి నాయకులు నేడు పతాంజలి కార్పొరేట్ సంస్థకు అప్పగించడాన్ని ఎలా సమర్దిస్తారని ప్రశ్నించారు.కార్పొరేట్ సంస్థ కోసం భూ కేటాయింపు చేస్తే సమర్థించబోమని ప్రజా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.సీపీఐ నాయకులు పియల్ నరసింహులు,కృష్ణప్ప,మురళి,సాంబశివలు మాట్లాడుతూ టూరిజం ప్రాజెక్టు కింద హార్సిలీహిల్స్ ను మరింతగా అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఒక మతానికి సంబందించిన పతాంజలి కార్పొరేట్ సంస్థకు భూములు అప్పగిస్తే అది ప్రజలకు తీవ్రమైన నష్టమన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హార్శిలీహిల్స్ లో ఆయుర్వేద యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.యోగా కంటే ప్రజలకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు ఎంతో ముఖ్యమని గుర్తుచేశారు.పేద ప్రజలు ఆహ్లాదకరంగా హార్సిలీహిల్స్ ను సందర్శించే అవకాశం లేకుండా దూరం చేయడమే కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమని విమర్శించారు.బాస్ అధ్యక్షులు పిటిఎం శివప్రసాద్ మాట్లాడుతూ యోగ అంతర్జాతీయ వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భూములు అప్పగించే బదులు పాఠశాలల్లో కళాశాలలో యోగా తరగతులు నిర్వహిస్తే మరింత అవగాహన పెరుగుతుందని గుర్తు చేశారు.పతాంజలి సంస్థను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.పేదలకు రెండు సెంట్లు భూమి ఇవ్వడాన్ని పాలక వ్యతిరేకించే ప్రభుత్వాలు కార్పొరేట్లకు ప్రభుత్వ భూములు ధారాదత్తం చేయడం తగదన్నారు.ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.
Reporter
Namitha News