Thursday, 16 April 2026 06:52:28 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

రాయలసీమను రతనాలసీమగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ద్యేయం - జలవనరుల శాఖ మంత్రి నిమ్మలరామానాయుడు

త్వరలో హంద్రీ - నీవా పనులు పూర్తి చేసి త్రాగునీటికి , సాగునీటి కొరత తీరుస్తాం

Date : 16 May 2025 08:06 PM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్ళపల్లి - మే 16 : రాయలసీమను రతనాల సీమగా మార్చడమే ప్రభుత్వ ద్యేయమని అందుకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తంబళ్ళపల్లి నియోజకవర్గం దొమ్మన బావి వద్ద హంద్రీ - నీవా పనులను మంత్రి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష, నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు, పలువురు టిడిపి నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం హంద్రీ - నీవా పనులను పరిశీలించి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పరిపాలన దక్షత కలిగిన ముఖ్యమంత్రి వీటన్నిటిని అధిగమించి హంద్రీనీవా కాలువను పూర్తిస్థాయిలో పారించి ప్రజలకు తాగునీరు సాగునీరు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో కలిసి తంబళ్లపల్లె వద్ద ఉన్న దొమ్మనబావి వద్ద ఉన్న హంద్రీ నీవా ప్రాజెక్టును పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. నీటి నిల్వ ప్రాంతాలు, ట్యాంకు కింద ఉన్న భూములు తదితర విషయాలను అధికారులతో చర్చించారు. హంద్రీ నీవా ద్వారా 3850 క్యూసెక్కుల నీటి సరఫరాకు ప్రణాళిక రచించి 90 శాతం పనులను ఆనాటి టిడిపి ప్రభుత్వం పూర్తి చేస్తే మిగిలిన 10 శాతం పనులను గత ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో కాలువల్లో చుక్క నీరు లేకుండా పోయిందన్నారు. సమ్మర్ స్టోరేజ్ వద్ద ఇసుకను దోపిడీ చేశారని ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేసి దోచు,కొన్నారు, ఇసుకను పూర్తిగా తోడెయ్యడంతో వర్షాధారం ద్వారా వచ్చే నీళ్ళు నిల్వ ఉండకుండా అడుగంటి పోవడం, లీకేజి సమస్యలు వస్తున్నాయి . భూగర్భ జలాల పెంపు సాగునీటి అవసరాల కోసం చెరువులను సంరక్షించాలని, రానున్న వర్షాకాలం కంటే ముందు చెరువుల్లో కూడికతీత పనులు చేపట్టాలని వీటన్నిటిని అరికట్టి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగునీరు, సాగు నీరు అందిస్తామన్నారు. ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు సాగునీరు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత రాయల సీమలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించి ప్రతి ఎకరాకు సాగునీరు, త్రాగు నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జనసేన నాయకులు, ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ ఎస్ఈ, ఈఈ, ఏఈలు,జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :