నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి : ఆగస్టు 16 : మదనపల్లి పట్టణంలోని వారపు సంత వద్ద ఒక క్యాంటీన్ , టమోటా మార్కెట్ వద్ద మరో క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆకలి ని తీర్చే అన్నా క్యాంటీన్ల ను మూసివేసి vari నోటి కాడ అన్నం ను లాక్కున్న చరిత్ర వైసిపి ప్రభుత్వానిది . ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా వంద క్యాంటీన్ల ను పునరుద్ధరణ చేసే కార్యక్రమం చేశారు . ఈ నేపథ్యంలోనే పేదలు ఎక్కువగా తిరుగాడే ప్రాంతాల్లో టమోటా మార్కెట్ , వారపు సంత వద్ద ఏకకాలంలోనే పునరుద్ధరణ చేసి నేడు ప్రారంభించడం చాలా తృప్తి నిస్తోందని , పేదలకు ఆపన్న హస్తం లాగా వారి ఆకలి తీర్చే కార్యక్రమం నాద్వారా ప్రారంభిడంతో చాలా తృప్తి నిస్తోందని తెలుపుతూ , కూలీలు , పేదలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేవలం 5రూ ధరకే అల్పాహారం , మధ్యాహ్నం భోజనం రూ 5/- రాత్రి భోజనం కూడా 5రూ లకే లభిస్తుందని తెలిపారు .
Admin
Namitha News