నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీలేరు - సెప్టెంబర్ 07 : అన్నమయ్య జిల్లా పీలేరు మండలం తలపుల గ్రామ పంచాయతి లోని చింతలబైలు దగ్గర వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రo శ్రీ మడ్గుండాల మల్లేశ్వర స్వామి ఆలయ పరిసరాలలో అన్యమతస్తులు చేస్తున్న అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకున్న గ్రామస్థులు. ఈ దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు పరిసర ప్రాంతాలలో మద్యం సేవించడం, మాంసాహారం వండటం మరియు భుజించడం మరియు ప్రేమికుల వికృత చేష్టలు చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా వారు పెడచేవిన పెడుతుండటంతో రక్షణ శాఖ వారికి తెలియజేయడం జరిగింది. అలాగే సూచీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇకమీదట ఇలా జరగకుండా ఈ రోజు ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమములో ఆలయ కమిటి చైర్మన్ శ్రీ మురళి గారు, పీలేరు పట్టణ సీఐ శ్రీ యుగంధర్ గారు, SI శ్రీ లోకేష్ గారు, గ్రామస్తులు శ్రీ హరికృష్ణ గారు, శ్రీ భగత్ గారు, శ్రీ రాజశేఖర్ గారు, ఏడుకొండలు, దాము రెడ్డి మరియు చుట్టు ప్రక్కల గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
Namitha News