నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 21 ః తంబళ్లపల్లె మండల ఐకెపి మండల సమాఖ్య అధ్యక్షురాలుగా రామలక్ష్మమ్మ మరో మారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఏపిఎం గంగాధర్ ఆధ్వర్యంలో ఎంఎస్ సమాఖ్య ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెస్ ప్రెసిడెంట్గా రామలక్ష్మమ్మ, కార్యదర్శిగా నౌజియా, కోశాధికారిగా ప్రమీల, ఉప అధ్యక్షురాలుగా సరస్వతి, ఉప కార్యదర్శిగా లక్ష్మీదేవిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని మండల సమాఖ్య ద్వారా ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రతిగడపకు అందడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిసిలు కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి, రమణ, మండలంలోని గ్రామ సమాఖ్య సభ్యులు, సంఘ మిత్రలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.
Reporter
Namitha News