నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత కార్యక్రమానికి రోగులు విస్తృతంగా పాల్గొని వైద్య సేవలు అందుకున్నారు. ఉదయం ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సహదేవరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. డాక్టర్ ఆశాలత బృందం రోగులకు వైద్య సేవలు అందించి ఆరోగ్య సూత్రాలు పాటించాలని, వ్యక్తిగత శుభ్రత, స్వచ్ఛమైన తాగునీరు తీసుకోవాలని సూచించారు. వైద్య బృందం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కృష్ణమూర్తి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిరుపేదల పాలిట ఓ వరమని రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి వద్దనే వైద్యం అందించడంతోపాటు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో ఆనంద్ కుమార్, కార్యదర్శి నరసింహులు, ఫార్మసిస్ట్ వేమారెడ్డి వైద్య బృందం, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
Admin
Namitha News