నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లాలో బొప్పాయి ధరలు పడిపోవడంతో రైతులు ఆగ్రహం తో సమ్మెబాట పట్టారు. శుక్రవారం ఉదయం నుంచి గ్రామాల్లో బొప్పాయి లారీలు అడ్డుకొని రహదారుల్లో వరి గడ్డని దగ్ధం చేసారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశాలను పట్టించుకోకుండా దళారీ వ్యవస్థ రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర ప్రకటించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.
Admin
Namitha News