నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్10 : తంబళ్లపల్లె మండలం లో వాలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగుతోంది. బుధవారం మండలంలోని పంచాయతీలకు చెందిన 38 మంది కార్యదర్శులు స్వచ్ఛందంగా ఎంపీడీవో కార్యాలయ అధికారి వివేకానందకు తమ రాజీనామా పత్రాలను విడివిడిగా సమర్పించారు. గత మూడు రోజులుగా తంబళ్లపల్లి మండలంలో వాలంటీర్ల రాజీనామా పరంపర లో భాగంగా 62 మంది ఎంపీడీవో కృష్ణమూర్తికి అందజేయగా బుధవారం బాలి రెడ్డి గారి పల్లి పంచాయతీకి చెందిన ఏడు మంది, కోసువారి పల్లెకు చెందిన 18 మంది, తంబళ్లపల్లి ఏడు మంది, గోపి దిన్నె, కుక్క రాజు పల్లెకు చెందిన ఇద్దరేసి, కోటకొండ, కన్నె మడుగు లో ఒక్కొక్కరు మొత్తం 38 మంది కార్యాలయ అధికారి వివేకానందకు అందజేశారు. వాలంటీర్లు అందజేసిన రాజీనామా పత్రాలను ఉన్నతాధికారులకు పంపుతామని కార్యాలయ అధికారి విలేకరులకు తెలిపారు.
Admin
Namitha News