Thursday, 16 April 2026 06:51:42 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో “మేక్-ఏ-థాన్ 2025” మేక్ ఫర్ మదనపల్లె అనే హ్యకథాన్

Date : 23 October 2025 10:03 PM Views : 286

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - అక్టోబర్ 23 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం వారి ఆధ్వర్యంలో “మేక్-ఏ-థాన్ 2025” మేక్ ఫర్ మదనపల్లె అనే హ్యకథాన్ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆనంద్ సపాటే, డిప్యూటీ ప్రోగ్రాం మేనేజర్, టైటాన్ కంపెనీ, బెంగళూరు మరియు గెస్ట్ అఫ్ హానర్ గా డాక్టర్ కే. మంజుల, ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, కలికిరి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆనంద్ సపాటే మాట్లాడుతూ విద్యార్థులకు టెక్నాలజీ పై మరియు వాస్తవ సమస్యల ను ఎలా ఎదురుకోవాలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉదేశ్యంగా అని అన్నారు. ఎంతో మంది విద్యార్థులు టెక్నాలజీ పై మక్కువతో అవగహన పెంచుకోగలరు కానీ, ఆ టెక్నాలజీ ని నిజమైన మరియు ప్రతి రోజు మనం ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారాలను నిర్వీర్యం చేయగలిగే స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు. తద్వారా విద్యార్థులలో ఆలోచన మరియు నైపుణ్యతను పెంచుకోగల శక్తి మరియు ఇంటర్ డిసిప్లినరీ పరిశోదన పై అవగాహన పెరుగుతుంది అని అన్నారు. మరో గెస్ట్ డాక్టర్ మంజుల మాట్లాడుతూ మదనపల్లె పరిసర ప్రాంతాలలో ఎదురవుతున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్ద్యేశం అని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉమ్మడి చిత్తూర్ జిల్లా టమోటా పంటలకు ప్రఖ్యాతి చెందిన ప్రాంతం అని, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో శాస్త్రీయ పద్దతులను రైతులకు అవగాహన కల్పించి, వారి సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, పట్టు వస్త్రాల పై మరియు టూరిజం మొదలైనవి ఇందులో ప్రధాన సమస్యలుగా ఎంచుకొని వాటి పరిస్కారాలు ఇందులో ముఖ్యమైనవి అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, మరియు సామాజిక బాధ్యత గుణాలు పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. మేక్-ఏ-థాన్ వంటి కార్యక్రమాలు విద్యార్థులకు వాస్తవ ప్రపంచ సమస్యలపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే అవకాశం ఇస్తాయని, స్థానిక సమాజ అభివృద్ధికి కూడా ఇవి తోడ్పడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎకో-సిస్టం డెవలప్మెంట్ పార్టనర్స్ అనన్య, ప్రాగ్రాం మేనేజర్,ఇన్యూనిటీ, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ, డాక్టర్ కిరణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :