నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు రక్తదాన శిబిరం అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపము నందు ఉన్న విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ నందు విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి సహకారంతో రక్తదాన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మంది విద్యార్థులు పాల్గొని స్వయంగా వారి ఆరోగ్యాన్ని పరీక్షించుకొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి గారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చునని గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చునని విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా విశ్వం విద్యాసంస్థల మేనేజ్మెంట్ శ్రీ ఏం ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు మరియు దీర్ఘకాలిక రోగులకు రక్తం చాలా అవసరమని రక్త దానం చేయడం ద్వారా శరీరంలో కొత్త రక్త కణాల ఉత్పత్తి జరుగుతుందని తద్వారా ఆరోగ్యం బాగుంటుందని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంజనీరింగ్ విభాగం కు చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు, విభాగాధిపతి శ్రీ హర్షద్ అలీ మరియు పద్మ సాధన ఫౌండేషన్ గ్రూప్ ఆఫ్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Reporter
Namitha News