నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - సెప్టెంబర్ 11 : అంగల్లు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు యన్.ఎస్.ఎస్ మరియు యన్.సి.సి విభాగం వారు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవము సందర్బంగా యూనివర్సిటీ లో సీనియర్ మేనేజర్ ఇంటర్నేషనల్ యు. విజయలక్ష్మి మాట్లాడుతూ ఓడిపోవడం తప్పు కాదు, విజయానికి అది ఓ మెట్టు మాత్రమే అని, మారుతున్న కాలానికి తగ్గట్లుగా పరుగులు తీయలేక కొందరు, ఆర్థిక, వ్యక్తిగత, మానసిక ఆందోళనతో మొదలైన కారణాలతో తనువు చాలిస్తు ఉంటారు. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నెడుతూ ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఆత్మహత్యల వల్ల నష్టాలు, అనంతర పరిణామాలు వివరిస్తే కొద్దిమేర వీటిని నివారించవచ్చు అని అన్నారు. ఆత్మహత్యల నివారణపై అవగాహణ కల్పించేందుకు అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంఘం (ఐఏఎస్‌పీ) ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఎంహెచ్)ల సహకారంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీని ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం గా నిర్వహిస్తున్నారు అని అన్నారు. ప్రతి సందర్భంలోనూ చికాకుపడటం, ఇతరులతో మాట్లాడకుండా ఏకాకిగా ఉండటం, తాము చేసే ప్రతిపనిలోనూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిద్రలేమితో బాధపడటం మరియు జీవితంలో తనకు కావాల్సింది ఏదీ దక్కలేదని పదేపదే ప్రస్తావించడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తులు ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నారని గ్రహించాలి అని, ఇవి గ్రహించిన తమ తోటి విద్యార్థిలు ముందుగా ఆ విద్యార్ధి గురుంచి వారి తల్లిదండ్రులకు చెప్పడమో, లేదా తమ అధ్యాపకులకు చేపడమో చేయాలనీ అన్నారు. కార్యక్రమం లో యెన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ పి.రాజేష్, యెన్.సి.సి వి కోఆర్డినేటర్ డాక్టర్ నవీన్ కుమార్ , అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News