Thursday, 16 April 2026 06:40:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

న్యాయం గెలిచింది చట్టాలపై గౌరవం పెరిగిందన్న కోనేటి సులోచన

Date : 03 December 2024 06:22 PM Views : 3909

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె పట్టణానికి చెందిన మార్పూరి వెంకటేష్వర్లు అలియాస్ మార్పూరి వెంకటేష్ నాయుడు కోనేటి సులోచన వద్ద డబ్బులు తీసుకుని రిజిస్టర్ చేసి ఇచ్చిన ఆస్తిని తాను సంతకాలు చెయ్యకనే ఫోర్జరీ సంతకాలతో పాకాల, పులివెందుల సబ్ రిజిస్ట్రార్ లు కోనేటి సులోచనకు రిజిస్టర్ చేసి ఇచ్చారని తప్పుడు కేసులు బనాయించారు. అయితే వెంకటేష్ నాయుడు తప్పుడు కేసులు పెట్టినట్లు రుజువు కావడంతో అతనిపై కేసులు నమోదు అయ్యాయని సులోచన పాత్రికేయుల సమావేశం లో తెలిపింది. ఈ సందర్బంగా సులోచన మాట్లాడుతూ మార్పూరి వెంకటేష్ నాయుడుకు తాను డబ్బులు చెల్లించిన తర్వాత పాకాల రిజిస్ట్రార్ ఆఫీసులో కొంత ఆస్తిని రిజిస్టర్ చేసి ఇచ్చాడని, అదే విధంగా పులివెందుల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మరి కొంత ఆస్తిని తన పేరిట రిజిస్టర్ చేసి ఇచ్చాడని సులోచన తెలిపింది. అనంతరం భూముల ధరలు పెరగటంతో అత్యాశకు పోయి రిజిస్టర్ చేసి ఇచ్చిన ఆస్తిని మార్పూరి వెంకటేష్ అసలు సంతకమే పెట్టలేదని, వేలి ముద్రలు కూడా తనవి కాదని ఫోర్జరీ సంతకాలతో తన ఆస్తిని కోనేటి సులోచన కొట్టేసిందని వెంకటేశ్వర్లు ఆరోపిస్తూ పాకాల, పులివెందుల సబ్ రిజిస్ట్రార్ల పైన సులోచనపైన కేసులు పెట్టాడని సులోచన తెలిపింది. దీంతో తనతో పాటూ ఇరువురు సబ్ రిజిస్ట్రార్ల పై తిరుపతి జిల్లా రిజిస్ట్రార్, కడప జిల్లా రిజిస్ట్రార్, రాష్ట్ర అత్యున్నత స్టాంపులు మరియూ రిజిస్ట్రేషన్ల ఐజి లోతుగా దర్యప్తు చేసి వెంకటేశ్వర్లు తప్పుడు ఫిర్యాదు చేశాడని ఫింగర్ ప్రింట్లు, సంతకం మార్పూరి వెంకటేష్ నాయుడుదే అని తేల్చారన్నారు. ప్రభుత్వ అధికారులపై తప్పుడు కేసులు పెట్టిన వెంకటేష్ పై క్రిమినల్ కేసులకు అధికారులు ఆదేశించారు. అనవసరంగా తమపై కేసు పెట్టిన మార్పూరి వెంకటేష్ నాయుడుపై పాకాల సబ్ రిజిస్ట్రార్ రహీముల్లా, పులివెందుల సబ్ రిజిస్ట్రార్ చంద్ర మోహన్ లు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.ఈ మేరకు మార్పూరి వెంకటేష్ నాయుడు పై పాకాల పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 16 వ తేదీన ఎఫ్ఐఆర్ నంబర్: 175/2024 గా, పులివెందుల పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 2వ తారీఖున ఎఫ్ఐఆర్ నంబరు 432/2024 గా వేర్వేరుగా కేసులు నమోదు చేసారని సులోచన తెలిపింది. అనవసరంగా తనపై కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, ప్రసార మాధ్యమాల ద్వారా దుశ్ప్రచారం చేసి తన పరువుకి భంగం కలిగించారు కాబట్టి మార్పూరి వెంకటేష్ నాయుడు, పార్వతమ్మ, వెంకట్రమణా రెడ్డి, రెడ్డి గోపాల్ నాయుడు, సునిత ల మీద హైకోర్టులో రిట్ పిటీషన్ వేయనున్నట్లు తెలిపింది.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :