నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : త్యాగాల పండగ బక్రీద్ అన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు . ఈ సందర్భంగా ఆయన ముస్లిం మైనారిటీ సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వమత సమ్మేళనం భారతదేశం అన్న ప్రసాదరావు .., అన్ని మతాలకు సంబంధించిన పండుగలు మన దేశంలో ఘనంగా జరుగుతాయన్నారు. అన్ని మతాల వారు కలిసిమెలిసి సోదర భావంతో తమ వేడుకలను జరుకునే సంస్కృతి దేశంలో ఉందన్నారు. ముస్లిం సోదరులు జరుపుకునే అతి ముఖ్య పండుగల్లో ఒకటైన (ఈద్-అల్-అదా) అనగా బక్రీద్ అన్నారు. ఇది ఇస్లాం మతంలో జరుపుకునే రెండవ అతిపెద్ద పండుగ అని ఆయన చెప్పారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల 10వ తేదీన ఈద్-ఉల్-అజా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ వస్తోందన్నారు. రంజాన్ నెల ముగిసిన తర్వాత వస్తుందనీ.., ఈ ఏడాది జూన్ 17వ తేదీన భారతదేశంలో ముస్లి సమాజం బక్రీద్ పండగను జరుపుకుంటోందని శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు తెలిపారు
Admin
Namitha News