నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె సెప్టెంబర్ 08 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె లో వినాయక చవితి పండుగ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. బస్టాండ్ లో ఏర్పాటు చేసిన నిలువెత్తు వినాయక విగ్రహానికి స్థానిక భక్తులు పెద్ద ఎత్తున అర్చనలు, అభిషేకాలు , ధూప దీప నైవేద్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటాలు, చెక్కభజనలతో బాటు ముగ్గుల పోటీలో పాల్గొని సందడి చేశారు. ఈ ముగ్గుల పోటీ లో గెలుపొందిన మహిళలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. అదేవిధంగా మారుమూల గ్రామాలలో సైతం భజన కార్యక్రమాలు, పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. పండుగ సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, స్థానిక శివాలయంలో శివునితో పాటు వినాయకునికి వందలాదిగా మహిళలు పూజలు నిర్వహించారు.
Admin
Namitha News