నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సిపిఐ అన్నమయ్య జిల్లా రెండవ మహాసభలు జయప్రదం చేయండి కడప బెంగళూరు రైల్వే లైన్ పనులు మదనపల్లి మీదుగా పుణప్రారంభించాలి బీటీ కళాశాల అభివృధి పేరుతో కళాశాలకు చితిని పెరుస్తున్న పాలకవర్గాలు సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు సిపిఐ మదనపల్లి పట్టణ మహాసభ ఈరోజు స్థానిక ఎస్టియు కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప,సాంబశివ పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన అన్నమయ్య జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని,ఈ జిల్లా పాలకుల పదవికాంక్షకు జిల్లా సమగ్రాభవృద్ధి బలవుతుందన్నారు.గత ప్రభుత్వ హయాంలోను,ఇప్పుడు కూటమి ప్రభుత్వం లోను జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని,నీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని తెగిపోయిన ప్రాజెక్టులు, మరమ్మతులు కూడా చేయలేదని, కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగుళూరు రైల్వే లైన్ పనులు ఏమాత్రం ప్రారంభించలేదని,చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు అసంపూర్తిగానే ఉన్నాయని,మదనపల్లి నుండి రామసముద్రం,మదనపల్లి నుండి నిమ్మనపల్లి రోడ్లు చాలా ప్రమాదకరంగా మారాయని,రోజువారి ఆక్సిడెంట్లు జరుగుతున్నాయని అయిన పాలకులు పట్టించుకోలేదని,ఎన్నికల సందర్భంగా నాయకులు రొడ్డును వెడల్పు చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు తప్ప,అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ రోడ్డు సంగతి మర్చిపోతున్నారన్నారు.కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను పి 4 పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తుందని,పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని పూర్తిగా దూరం చేస్తుందన్నారు.బిటి కళాశాల అభివృద్ధి చేస్తామని పైకి చెబుతూనే, ఇంకోవైపు బిటి కళాశాలకు చితిని పేరుస్తున్నారన్నారు. త్వరలోనే బీటీ కళాశాల పైన పాలకులు మరియు అవినీతి పరులైన కొంతమంది చేస్తున్న కుట్రల పైన సిపిఐ,ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి కే మురళి సిపిఐ నాయకులు మాధవ్,రెడ్డి శేఖర్,తిరుమలప్ప,దేవా,ముబారక్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News