Thursday, 16 April 2026 06:53:58 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తంబళ్లపల్లె సమస్యల పరిష్కారానికి మీరే దిక్కు స్వామి - ఇంచార్జ్ మంత్రికి నాయకుల మొర

Date : 04 November 2025 09:09 PM Views : 372

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 04 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో గత కొంతకాలంగా కల్తీ మద్యం కలకలంతో గతంలో ఇన్చార్జిగా వ్యవహరించిన దాసరిపల్లి జయచంద్ర రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిస్తేజంలో మునిగిపోయారు. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని అధికారం ఉండి కూడా చేతగాని వారిలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లె టిడిపి నాయకులు మంగళవారం రాయచోటి లో ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని మొరపెట్టుకున్నారు. మంగళవారం టిడిపి నాయకులు ఇన్చార్జి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజులను కలిసి తమ సమస్యలను వివరించారు. దశాబ్దాలుగా నిలిచిపోయిన తంబళ్లపల్లె-శివపురం రోడ్డు నిర్మాణం, తంబళ్లపల్లె తాసిల్దార్ కార్యాలయం పునర్నిర్మాణం, కోసువారిపల్లె మహిళా శక్తి భవన నిర్మాణం,పెద్దేరు ప్రాజెక్ట్ పార్క్ సుందరీ కరణ, చెరువుల కట్టలు , కాలువలు,మరమ్మతులు, కొట్టాల ఏటిగడ్డ, చౌడ సముద్రం ఏరు, దయ్యాలవారిపల్లె, పెద్దేరు ప్రాజెక్టు కింద బ్రిడ్జిల నిర్మాణం, చిన్నేరు, దబ్బలగుట్టపల్లి ప్రాజెక్టుల కాలువల భూముల రైతులకు పరిహారం,మల్లయ్య కొండపై గెస్ట్ హౌస్ల నిర్మాణం, మల్లయ్య కొండ, సింగల్ విండో, చైర్మన్ ల నియామకం, ఇంకా పలు సమస్యల ను మంత్రికి నాయకులు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే స్పందించి తంబళ్లపల్లె ను సందర్శించి ప్రతి సమస్యను పరిష్కరించి తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు సహకరిస్తానని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో భవిష్యత్తులో ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందరికీ నిత్యం అందుబాటులో ఉండే నాయకున్ని ఇన్చార్జిగా నియమించడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రాయచోటి లో మంత్రులతో కలవడానికి తంబళ్లపల్లె మండలం నుండి పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :