నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె భార్య అలిగి వెళ్లిందని ఉరి వేసుకుని డ్రైవర్ ఆత్మహత్య భార్య అలిగి పుట్టినింటికి వెళ్లడంతో మనస్థాపం చెందిన ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం మదనపల్లె వన్ టౌన్ సీఐ చాంద్ బాషా తెలిపారు. స్థానిక నీరుగట్టువారిపల్లె లోని రామిరెడ్డి లేఔట్ లో ఉంటున్న షేక్ రెహమాన్ కుమారుడు డ్రైవర్ రిజ్వాన్ 35, భార్య అలిగి పుట్టింటికి వెళ్లి తిరిగి కాపురానికి రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన రిజ్వాన్ తను ఉంటున్న ఇంటి మౌల్డింగ్ కమ్మికి చీరతో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు
Reporter
Namitha News