నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - నవంబర్ 09 : మెడికల్ కళాశాలల పి.పి.పి. విధానం లో అభివృద్ధి కి వ్యతిరేకంగా వైయస్ ఆర్ సిపి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమం లో భాగంగా కోటి సంతకాలను సేకరించి గవర్నర్ కు సమర్పించాలని తీసుకొన్న నిర్ణయం మేరకు నేడు పుంగనూరు బస్ స్టాండ్ వద్ద నున్న దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కు నివాళులు అర్పించిన అనంతరం కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ మాజీ సియం వైయస్ జగన్ ఏక కాలంలో 17 వైద్య కళాశాలను తీసుకొస్తే దానిని ప్రవేట్ పరం చేయుటకు పి.పి.పి. విధానం లో అభివృద్ధి చేయాలని తీసుకొన్న నిర్ణయం తో పేద ప్రజలకు వైద్యం తో పాటు వైద్య విద్య ను కూడా దూరం లకు చేస్తుందని, ఈ పి.పి.పి. విధానం ను వెనక్కి తీసుకొని పేద ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం అంటూ కార్యకర్తలకు గ్రామస్తాయి లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసం ను ప్రజలకు వివరిస్తూ కోటి సంతకాలను సేకరించి గవర్నర్ కు సమర్పిద్దాం అని పిలుపునిచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
Reporter
Namitha News