నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి -మే 23 : రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు సమర్పించిన అరవ శ్రీధర్ వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటన తిరుపతి జిల్లా జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అందజేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఈ రోజు (శనివారం) రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన పలు ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు. అనంతరం వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పవన్‌కు తెలిపారు. కొన్ని రోజులుగా హర్ష వీణ, ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ మోసం చేశారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా పలు సంచలన వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు కాగా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు అరవ శ్రీధర్‌పై తాజాగా మరికొన్ని రాజకీయపరమైన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వ విప్ పదవికి ఎమ్మెల్యే శ్రీధర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Reporter
Namitha News