Wednesday, 29 July 2026 05:19:30 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

దుర్వాసన.. దుర్గంధం.. ఎటు చూసినా చెత్త కుప్పలే డ్రెయినేజీలు శుభ్రం చేయరా..?

అధికారులను ప్రశ్నించిన నిస్సార్ అహమ్మద్

Date : 07 July 2026 04:51 PM Views : 93

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దుర్వాసన.. దుర్గంధం.. ఎటు చూసినా చెత్త కుప్పలే డ్రెయినేజీలు శుభ్రం చేయరా..? అధికారులను ప్రశ్నించిన నిస్సార్ అహమ్మద్ : మదనపల్లె పట్టణంలో స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, ఎటు చూసినా చెత్త కుప్పలు, అపరిశుభ్రమైన డ్రెయినేజీలు, భరించలేని దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆరోపించారు. మంగళవారం మదనపల్లె రూరల్ మండలం కొత్తఇండ్లు పంచాయతీలో ఈఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాళ్ల సుబ్బన్న వీధిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు, చెత్త కుప్పలు, శుభ్రం చేయని డ్రెయినేజీలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ప్రాంతాన్ని పరిశీలించిన నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలో పారిశుధ్యం పూర్తిగా పడకేసిందని, తాళ్ల సుబ్బన్న వీధి అందుకు నిదర్శనంగా నిలుస్తోందని విమర్శించారు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోయి భరించలేని దుర్గంధం వెదజల్లుతోందని, డ్రెయినేజీలను శుభ్రం చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో పారిశుధ్య నిర్వహణపై స్పెషల్ ఆఫీసర్లు శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుధ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీఎస్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్.కే. ఇర్ఫాన్, మండల బూత్ కమిటీ అధ్యక్షుడు చిప్పిలి మల్లికార్జునరెడ్డి, ఈశ్వర్ నాయక్, బయ్యారెడ్డి, బీఎల్‌ఏలు ఖాజా, రోషన్, షంషాద్ బేగం, రామాంజి, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :