Saturday, 18 April 2026 04:01:15 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ

స్వాతంత్ర సమర యోధుల పేర్లను తొలగించి,చరిత్రలో లేని వాళ్ళ పేర్లు పెట్టడం ఏంటీ...?

Date : 17 April 2026 09:09 PM Views : 11

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 17 : మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కు స్వాతంత్ర సమర యోధుల పేర్లను కాదని రామ్ జీ ఆంటూ చరిత్రలోలేని,పరిపాలనకు ఆదర్శం కాని ఒక వర్గ భావజాలానికి సంబందించిన వ్యక్తుల పేర్లు పెట్టడం ఏంటని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప విమర్శించారు.శుక్రవారం బి.కొత్తకోటలో ఆపార్టీ నియోజకవర్గపుకార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి మరియు మండల ముఖ్య నాయకులతో కలిసి స్థానిక విలేకరులతో మాట్లాడారు.ఈ మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పధకం పేరులో మార్పులు చేస్త్తూనే,గాందీ గారి పేరును తొలిగించి, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల కేటాయింపులను కూడా పూర్తీగా తగ్గించేసిందని,అప్పటి నుంచి ఇటు కాంగ్రెస్ తో పాటు,వామ పక్షాలు కూడా దీనిని పూర్తీగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తూనే వున్నాయన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అనంతపురంలో సీపీఐ,వ్యవసాయ కార్మిక సంఘం,రైతు సంఘాలతో పాటు సిపిఎం,కాంగ్రెస్,వైఎస్ఆర్ సీపీ నాయకత్వం మద్దతుతో ఒక మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించడం జరిగిందని ఈ యొక్క పాదయాత్ర ముగింపు సభలో కష్టజీవులు వేలాది మంది పాల్గొని విజయవంతం చేశారని అన్నారు.నాడు కమ్యూనిస్టుల సూచన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరికీ పనిలేని దినాల్లో పని కల్పించాలనే లక్ష్యంతో ఆనాడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను యూపీఏ ప్రభుత్వం అమలు చేసిందని,ఈ పధకం ఎంతో దిగ్విజయంగా అమలవుతోందని,అలాంటి పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇక మళ్ళీ మేము అధికారం లోకి వస్తామో రామో అనే ఉద్దేశంతో ఇప్పుడే ఆ పథకానికి తూట్లు పొడిచి, ఆ పథకాన్ని రద్దు చేసెయ్యాలనే దురుద్దేశంతోనే ఈ కుట్రలకు పాల్పడుతోందన్నారు. ఇది వరకూ పూర్తి భారాన్ని భరించే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించుకొనే ఆలోచనతోనే ఈ రకమైన కుట్రలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ 3లక్షల 24 వేల కోట్ల రూపాయల అప్పుతో మూలుగుతుంటే...అదనంగా ఉపాధి హామీ పధకం కోసం మళ్లీ 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడనుంచి తీసుకురాగలదు? అని అయన కేంద్ర ప్రభుత్వం ను ప్రశ్నించారు.కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే తన నిధుల భారాన్ని తగ్గించుకొని,రాష్ట్రాలపై అదనపు భారాన్ని మోపి క్రమంగా ఆయా రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం రద్దుకు పరోక్షంగా కుట్రలు పన్నుతోందని,ఈ కుట్రలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాలని వారు సూచించారు.రాయలసీమ జిల్లాల్లో కరువు ఎంత భయంకర వాతావరణాన్ని సృష్టిస్తుందంటే వూళ్ళకు వూళ్ళు ఖాళీ చేసి కువైట్, కట్టర్,దుబాయ్ లాంటి విదేశాలకు,ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు వుంటాయని,ఇప్పుడు ఈ ఉపాధి పథకం కు ఇన్ని షరతులు పెడితే ఇది ఎలా ముందుకు సాగుతుందన్నారు.దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తీగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఉపాధికి సమాధి కట్టే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మికులు, కర్షకులు తమ ఉద్యమ పంథా ద్వార రాజకీయ సమాధి కట్టడానికి కార్మిక లోకం సిద్ధంగా ఉందన్నారు.కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ కొత్త పథకానికి పాతరేసి,పాత విధానాన్నే అనుసరించి, పెరిగిన రేట్లకు అనుగుణంగా కూలి రేట్లు కూడా పెంచాలని,లేనిపక్షంలో ఉపాథి కూలీలను,రైతుల ను కలుపుకొని బీజేపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా గట్టిగా బుద్ధి చెబుతామని వారు కేంద్ర ప్రభుత్వంను హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి జి. రఘునాథ్,పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్ అలీ, ఏఐటియు మండల సమితి అధ్యక్షుడు ఎస్.తంబయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :