నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 24 : రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని వీడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఎస్సైటి.అనిల్ కుమార్ సూచించారు. ఆదివారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరు పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని శాంతి భద్రతలకు అనుగుణంగా ప్రవర్తించాలని సూచించారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది, రౌడీ షీటర్లు పాల్గొన్నారు
Reporter
Namitha News