Saturday, 12 September 2026 05:24:01 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

తంబళ్లపల్లె లో జి. శంకర్ యాదవ్ కు టిడిపి శ్రేణుల బ్రహ్మరథం

గజమాలతో జి. శంకర్ఘ కు కార్యకర్తలు ఘన సత్కారం

Date : 30 August 2026 09:04 PM Views : 301

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 30 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ కు మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జి శంకర్ యాదవ్ ను యువనేత బాలాజీ బృందం గజమాలతో సత్కరించి ఊరేగింపు నిర్వహించారు. తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా వచ్చిన జి శంకర్ యాదవ్ కు మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీ మహిళలు కర్పూర హారతులతో ఘన స్వాగతం పలకగా వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులతో మొలకలచెరువు రహదారి జనసంద్రంగా మారింది. క్లస్టర్ ఇంచార్జ్ లు బేరి శ్రీనివాసులు, బి ఎం ఆర్ లు ఏర్పాటుచేసిన బాణసంచా పేలుళ్లు, చెక్క భజనలు, పిల్లనగ్రోవి నృత్యాలు, ప్రత్యేక వాయిద్యాలు, వందల డప్పుల మోతలతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది.ఈ సందర్భంగా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, శంకరన్న నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించగా అడుగడుగునా మాజీ ఎమ్మెల్యే కి పూల వర్షం కురిపిస్తూ క్రాస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ వరకు అశేష జనవాహిని ఊరేగింపు తో చేరుకున్నారు. జి శంకర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి టిడిపి జెండా ఆవిష్కరించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో టిడిపికి నా టిడిపి కుటుంబ సభ్యుల సహకారంతో పూర్వ వైభవం తీసుకువస్తానని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ప్రతి టిడిపి సభ్యుడు నా సోదరులతో సమానమని భవిష్యత్తు కోసం ప్రతి కార్యకర్త ముందుకు రావాలని వారికి అహర్నిశలు అండగా నిలబడి కాపాడుకుంటానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి విజయ మోగించడానికి ప్రతి టిడిపి సభ్యుడు నడుం బిగించాలని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సిద్ధమ్మ,పురుషోత్తం, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల రెడ్డి, వీరాంజనేయులు, డేరంగుల చంద్రమోహన్, కోసువారి పల్లిసోమశేఖర్,గంగరాజు, నరసింహులు, కన్నె మడుగు సురేంద్ర, సోమశేఖర్, బాలరాజు,గుండ్లపల్లి లక్ష్మీనారాయణ , కుక్క రాజు పల్లి మదనమోహన్, కోసువారిపల్లి దళిత నాయకుడు సలాది రాజశేఖర్, ముద్దలదొడ్డి వెంకటరెడ్డి, కొటాల శివకుమార్, గోపి దీన్నే సుధాకర్, అల్లావుద్దీన్,కాలా నారాయణ, ఎర్రసానిపల్లి సుధాకర్, ధన శేఖర్, కొటాల గ్రామ అధ్యక్షుడు సుధాకర్, పాపిరెడ్డి పల్లి గంగులప్ప, గంగిరెడ్డిపల్లి శంకర్ రెడ్డి, చాంద్ భాషా, శ్రీనివాసులు, మోహన్ రెడ్డి, ఉప్పులూరి వారి పల్లి వెంకటరెడ్డి, కుక్క రాజ్ పల్లి శేఖర్ రెడ్డి, ఆదిరెడ్డి, కృష్ణారెడ్డి, వందలాదిగా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: