Monday, 14 September 2026 09:33:41 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఆపరేషన్ వజ్ర ప్రహార్ తో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

పాఠశాలలు, కళాశాలల సమీపంలో డ్రగ్స్ విక్రయాలపై కట్టుదిట్టమైన నిఘా

Date : 29 May 2026 08:43 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టి.. మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల కమిటీతో 'డ్రగ్స్ వద్దు బ్రో' సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తో కలసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నివారణ రవాణాను అరికట్టేందుకు ప్రణాళిక బద్ధంగా సమన్వయంతో పని చేయాలన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెం.1972 కు ఫోన్ చేసి తెలిపేలా విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. "డ్రగ్స్ వద్దు బ్రో" ప్రచార పోస్టర్లలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్లతో జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలన్నారు. డిఆర్డిఏ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో వారం వారం జరిగే మహిళా సంఘాల కమిటీలలో ఈ విషయంపై తప్పనిసరిగా అజెండా పెట్టుకుని విస్తృతంగా చర్చ జరపాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఎవరైనా గంజాయి సేవించే వారి వివరాలు తెలిసినప్పుడు టోల్ ఫ్రీ మరియు వాట్సప్ నెంబర్లకు సమాచారం పంపించేలా విస్తృతంగా మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని, సమాచారం అందజేసిన వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈగల్ క్లబ్ లను మరింత మెరుగ్గా పనిచేసేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు, విద్యాసంస్థల సమీపంలో మాదకద్రవ్యాల ఉత్పత్తుల వినియోగం, అమ్మకాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గుట్కాను కూడా కంట్రోల్ చేయాలని, మైనర్లకు తుపాకోను విక్రయిస్తే సదర్ షాపులను సీజ్ చేస్తామని మున్సిపాలిటీలలో, పంచాయతీలలో అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో ఉన్న అతిపెద్ద మాదకద్రవ్యాల సమస్యను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం జనవరి 26 నుండి ఇప్పటివరకు మొత్తంగా 17 కేసులలో 129.66 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. 78మంది అమ్మకందారులను, 21మంది వినియోగదారులను, 4మంది రవాణా సరఫరా దారులు, ఒక రిటైల్ వ్యాపారిని గుర్తించామన్నారు. ఇందులో భాగంగా 109 మంది నిందితులను గుర్తించి, 94 మందిని అరెస్ట్ చేసామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం“ఆపరేషన్ వజ్ర ప్రహార్” పేరుతో 30 రోజుల పాటు నిరంతర మాదకద్రవ్యాల నిరోధక కార్యక్రమాన్ని ప్రారంభమైన తర్వాత జిల్లాలో సింథటిక్ డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడం, చిల్లర విక్రయ నెట్ వర్కులను నిర్మూలించడం, వాణిజ్య మరియు సరఫరాల గొలుసులను అంతరాయం కలిగించడం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక దాడులు మరియు గస్తీ చర్యలను మరింత వేగవంతం చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ, పోలీస్ శాఖ వారు సమన్వయంతో 55 ఈగల్ క్లబ్స్ ద్వారా జిల్లాలో ప్రతినెల స్కూల్లో, కాలేజీలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, జిల్లా రవాణా శాఖ అధికారి, డీఎస్పీలు, డీఈవో, డిఎంహెచ్ఓ, మదనపల్లె ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అడిషనల్ డి సి హెచ్ ఎస్, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, జిల్లాఅధికారులు, డిఎస్పి, ఎస్హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: