Saturday, 12 September 2026 01:52:36 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

విద్యుత్ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాం - రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయ మూర్తి

Date : 06 August 2026 10:22 PM Views : 129

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 06 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని విద్యుత్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి హామీ ఇచ్చారు. గురువారం తంబళ్లపల్లె సబ్ స్టేషన్ లో విద్యుత్ శాఖ డి ఈ గంగాధరం ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ అదాలతో చైర్ పర్సన్ శ్రీనివాస ఆంజనేయ మూర్తి తో పాటు సభ్యులు మధు కుమార్, శ్రీనివాసరాజు, విజయలక్ష్మిలు పాల్గొని విద్యుత్ వినియోగదారుల సమస్యలను సుదీర్ఘంగా విచారించారు. తంబళ్లపల్లె లో తరచూ విద్యుత్ లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి 132 కెవి సబ్ స్టేషన్ నిర్మాణం, డిజిటల్ బిల్లులు చెల్లింపులు వద్దని, విద్యుత్ శాఖ సెక్షన్ కార్యాలయం, క్రాస్ రోడ్ హాస్టల్ పరిధిలో లో వోల్టేజ్, సినిమా థియేటర్ వద్ద ట్రాన్స్ఫార్మర్ మార్పు, కోసువారిపల్లి సబ్ స్టేషన్ పరిధిలో లో వోల్టేజ్, సోలార్ విద్యుత్ పై అవగాహన కల్పించాలని, విద్యుత్ సిబ్బంది కొరత,ఇంకా పలు సమస్యలు వినియోగదారులు అదాలత్ దృష్టికి తెచ్చారు. మండలంలో ఇప్పటికే లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ డి ఈ కృషిని వినియోగదారులు కొనియాడారు. విద్యుత్ అదాలత్ చైర్మన్ తో పాటు సభ్యులు సినిమా థియేటర్ వద్ద ట్రాన్స్ఫార్మర్ పరిశీలించారు. అనంతరం వారు అదాలత్ లో మాట్లాడుతూ ప్రతి విద్యుత్ సమస్యను పరిష్కారానికి విద్యుత్ సిబ్బంది కృషి చేయాలని సూచనలు చేశారు. సామాన్య మధ్యతరగతి వినియోగదారుల మైనర్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాల్సి ఉందని సూచించారు. భవిష్యత్తు లో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి సీఎం డి తో మాట్లాడి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విద్యుత్ అదాలత్ లో ఏడి గోవిందరెడ్డి, ఏఈ సురేంద్ర, జే ఏ ఓ బాబ్జాన్, పీటీఎం, మొలకలచెరువు, కొత్తకోట ఏ ఈ లు గిరి, శేషు, ముజుమిల్లా, ఎల్ ఐ లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్లు శంకర్, రమణ ,అప్పి రెడ్డి, అమీన్, ఇంతియాజ్, శ్రీకాంత్, ప్రసాద్, డివోభాస్కర్, రమేష్, ప్రవీణ్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :