Sunday, 13 September 2026 07:10:02 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

కౌశల్ ప్రతిభా పరీక్షల నిర్వహణకై జిల్లా,రాష్ట్ర కో-ఆర్డినేటర్ల నియామకం

అన్నమయ్య నుండి నలుగురు ఉపాధ్యాయుల ఎంపిక

Date : 01 September 2026 07:36 PM Views : 73

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కౌశల్ ప్రతిభా పరీక్షల నిర్వహణకై జిల్లా,రాష్ట్ర కో-ఆర్డినేటర్ల నియామకం - అన్నమయ్య నుండి నలుగురు ఉపాధ్యాయుల ఎంపిక మదనపల్లె : భారతీయ విజ్ఞాన మండలి (బీవీఎం) మరియు ఏపీ - కాస్ట్ సంయుక్తంగా ప్రతి సంవత్సరం నిర్వహించే కౌశల్ ప్రతిభా పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్నమయ్య జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో వివిధ బాధ్యతలకు ఉపాధ్యాయులను భారతీయ విజ్ఞాన మండలి రాష్ట్ర శాఖ నియమించింది.అన్నమయ్య జిల్లా కో-ఆర్డినేటర్‌గా గట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బి.కొత్తకోట మండలం) పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కట్టా భాస్కర్ నియమితులయ్యారు.జిల్లా జాయింట్ కో-ఆర్డినేటర్లుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కురబలకోటలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పి.రెడ్డి రాధ,జిల్లా పరిషత్ పాఠశాల మదనపల్లిలో గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జి.రవి కుమార్ నియమితులయ్యారు.అదేవిధంగా రాష్ట్ర అకడమిక్ కో-ఆర్డినేటర్‌గా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,రాయచోటిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మధుమతిలు ఎంపికయ్యారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం,సృజనాత్మక ఆలోచనా శక్తి,ప్రతిభను వెలికితీయడం మరియు వారిలో పోటీతత్వ స్ఫూర్తిని పెంపొందించడంలో కౌశల్ ప్రతిభా పరీక్షలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు నియమితులైన కో-ఆర్డినేటర్లు కృషి చేయనున్నారు.జిల్లా,రాష్ట్ర కో-ఆర్డినేటర్లుగా ఎంపికైన ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమకు ఈ అవకాశం కల్పించిన భారతీయ విజ్ఞాన మండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని,సృజనాత్మక ఆలోచనలను వెలికి తీయడానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :