Thursday, 30 July 2026 05:44:07 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్.రెడ్డీ సాహెబ్ నిర్విరామ కృషి - కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు

Date : 19 July 2026 04:31 PM Views : 68

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్.రెడ్డీ సాహెబ్ నిర్విరామ కృషి - కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు - పార్టీ శ్రేణులు,అభిమానుల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు మదనపల్లె : కాంగ్రెస్ పార్టీలో అత్యంత సమర్థవంతమైన నాయకుడు ఎస్.రెడ్డి సాహెబ్ అని మదనపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు.పట్టణంలోని దొంతి వీధి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎస్.రెడ్డీ సాహెబ్ పుట్టిన రోజు వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి.నాయకులు,కార్యకర్తలు అభిమానులు దుశ్శాలువతో ఘనంగా సన్మానించి,కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీనే తన ఊపిరిగా భావించి పార్టీ అభ్యున్నతి కోసం ఎస్.రెడ్డి సాహెబ్ అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ అధిష్టానం వద్ద తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.నిరంతరం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి,కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎస్.రెడ్డి సాహెబ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.అనంతరం రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ చిన్నతనం నుండి తనకి కాంగ్రెస్ పార్టీ అంటే అంతులేని అభిమానం అని,ఆ అభిమానమే తనను కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువ చేసిందన్నారు.దేశ ప్రజల సంక్షేమం,శ్రేయస్సు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు‌.ఇప్పటి నుండే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసే 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకొని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చాలని ఆయన పిలుపునిచ్చారు.అదేవిధంగా తనపై ఎంతో అభిమానంతో పుట్టినరోజు వేడుకలకు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని,ఇదే అభిమానం మున్ముందు తనపై కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకురాలు మీనా కుమారి,అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శరత్ కుమార్ రెడ్డి,ఈశరయ్య,మహబూబ్ పీర్,నాగరాజు,ఖాసీం వలి,ఈశ్వరమ్మ,అల్లాబక్షు,హబీబ్,జీవన్ కుమార్,అసీఫ్,మౌలాలి,బావజాన్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: