నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : పుంగనూరు నందు ప్రతి సోమవారం లాగే ఈ సోమవారం కూడా నిరుపేదలకు , రైతులకు , నిరాశ్రయులకు ,చిరు వ్యాపారులకు అమ్మ అన్నదాన కార్యక్రమం టీం సభ్యులు చే అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టి ఐదు వారాలు గా పుంగనూరు టౌన్ ముడేప్ప సర్కిల్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అమ్మ అన్నదాన సభ్యులు మాట్లాడుతూ కార్యక్రమానికి తమ వంతు పూర్తి సహాయ , సహకారం అందించిన వారు రాగానిపల్లి రోడ్డు లోని 4వ వీధి లో కాపురం ఉండు శ్రీ దేవేంద్ర ప్రస్తుతం దేవేంద్ర గారు N.R.I ( దుబాయ్) దేశం Abu Dhabi లో నివాసం ఉంటున్నారు. అన్న దాత దేవేంద్ర మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అమ్మ అన్నదాన కార్యక్రమం సభ్యులు కోరుకుంటున్నామన్నారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ అమ్మ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకి ధన్యవాదములు తెలియజేసారు.
Admin
Namitha News