నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జులై 23 : రామసముద్రం మండల కేంద్రం లోని దిగువపేట లో వెలసియున్న చంద్రశేఖరస్వామి ఆలయం లో శ్రీ వల్లి దేవసేన కుమారస్వామివారి ఆలయం లో బుదవారం ఉదయం ఆలయ శుద్ధి స్వామి వారికి పలు రకాల పుష్పాలతో అలంకరణ అర్చనలు, అభిషేకాలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు బాలాస్వామి, భక్తులకు దర్శన బాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం లో హరోం హర మేల్ మురుగన్ అంటూ భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యం స్వామిని వేడుకున్నారు.ఆలయ అర్చకులు పుష్ప పల్లకి ని పలు రకాల పుష్పలతో అలంకరించి. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామివారు.స్వామివారికి మంగళ హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యం స్వామి వారి గ్రామ్మోత్సవానికి ఉబయ దారులు గబ్బురి సుబ్రహ్మణ్యం శెట్టి, కృష్ణయ్య శెట్టి, సుదర్శన్ బాబు, బద్రినాథ్,మంజునాథ్ మధుసూదన్,సుబ్బరాజు నాగరాజ శెట్టి, రమేష్, సురేష్,అనంతరం ఆలయంలో భక్తులకు గబ్బురి సుదర్శన్ బాబు కుటుంబ సభ్యులు వారిచే అన్నదానం నిర్వహించారు.
Admin
Namitha News